పుట్టినరోజు పార్టీలో ఘర్షణ : బీజేపీ కార్యకర్త హత్య

88

పుట్టినరోజు వేడుకలో జరిగిన తీవ్ర వాదులాటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పొడిచి చంపారు.
ఈ సంఘటన ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో జరిగింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మృతుడిని రింకు శర్మగా గుర్తించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది.

నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నలుగురిని మహ్మద్ డానిష్ (36), మహ్మద్ ఇస్లాం (45), జాహిద్ (26), మహ్మద్ మెహతాబ్ (20) గా గుర్తించారు. డానిష్, ఇస్లాం దర్జీలుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెహతాబ్ ఢిల్లీలోని ఓ కేంద్రీయ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు.. రింకు (25) బిజెపి యువజన విభాగానికి కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ.. మాంగోల్‌పురిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

డానిష్ , రింకు బుధవారం ఓ పుట్టినరోజు పార్టీకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఓ విషయంలో ఇద్దరికి తీవ్రమైన ఘర్షణ జరిగిందని దీంతో రింకుపై కోపం పెంచుకున్న డానిష్.. తనతోపాటు మరో ముగ్గురు స్నేహితులకు విషయం చెప్పి పార్టీ అయిపోయిన తరువాత.. నలుగురు కలిసి రింకును పొడిచి చంపారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.