తెలుగు ఛానల్ పై పరువునష్టం దావా

223

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.. ఓ తెలుగు న్యూస్ ఛానల్ పై పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి కారణం తిరుమలపై అసత్య ప్రచారం చెయ్యడమే.. ఓ ఛానల్ కావాలనే పనిగట్టుకొని తిరుమల వెంకన్న సన్నిధిలో క్రెస్తవికరణ జరుగుతుందంటూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని బీజీపీ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. అలా తప్పుడు ప్రచారం చేసే వాటిలో ఒక చానల్‌పై మొదటగా పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు తెలిపారు. వేంకటేశ్వరస్వామి భక్తుడిగా ఈ విష ప్రచారానికి విసిగిపోయి ఓ వర్గం మీడియాపై పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆర్థిక సాయం అందజేసే మీడియా సంస్థలే ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు

కాగా ఇయ్యన ఇప్పటికే అనేకమంది ప్రముఖ రాజకీయ నేతలపై కేసులు వేశారు. అక్రమాస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై కేసు వేసి విజయం సాధించారు. జయలలితను జైలుకు కూడా పంపారు. ఇక సోనియా, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలపై కూడా సుబ్రమణ్య స్వామి కేసులు వేశారు. ప్రస్తుతం వారు బెయిల్ పై బయట ఉన్నారు. అనేక మంది రాజకీయ నేతలు, ప్రముఖులపై స్వామి కేసులు వేసి స్వయంగా వాదించారు. ఆర్ధిక శాస్త్రంతోపాటు, న్యాయశాస్త్రంలో స్వామికి మంచి పట్టు ఉంది.

తెలుగు ఛానల్ పై పరువునష్టం దావా