ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

97

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో నూతన పర్యాటక విధానం అమలు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ముఖ్యాంశాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. కేబినెట్ వివరాలు ఇలా ఉన్నాయి..

కేబినెట్ నిర్ణయాలివే..
*రైతు భరోసా మూడో సీజన్‌కు ఆమోదం.. డిసెంబర్ 29న రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
*రైతులకు రూ.719 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు
*ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషణం నియామకానికి ఆమోదం
*పశుసంవర్ధకశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీ
*పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ మేనేజ్‌మెంట్‌ ఏర్పాటుకు ఆమోదం
*సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ అమలుకు ఆమోదం
*1,100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై సబ్సిడీకి ఆమోదం
*రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ఆమోదం
*ల్యాండ్ సర్వే, బౌండరీ చట్టంలో 5 సవరణలకు ఆమోదం
*ల్యాండ్ రికార్డుల తయారీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం
*తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ ఏర్పాటుకు ఆమోదం
*ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేసే పరిశ్రమల పార్కుకు.. ఏర్పేడులో పరిహారం చెల్లింపులకు ఆమోదం
*ఈ ఏడాది మార్చి నుంచి కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న.. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదం
*400 కోట్లకు మించి పెట్టుబడులు పెడితే మెగా పరిశ్రమ హోదా
*చింతలపూడి ఎత్తిపోతల పధకం కోసం నాబార్డు నుంచి 1931 కోట్ల రుణం కోసం కేబినెట్ ఆమోదం