దళితులను దారుణంగా మోసం చేసి రూ. 4 కోట్లతో ఉడాయించాడు.

99

ఈ సమాజంలో మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవారికి కొదవ ఉండదు. ఎడారిలో కూడా ఇసుక అమ్మే మేధావులు మనచుట్టూ ఉంటారు. వారిని గుర్తించలేకపోతే పప్పులో కాలేయడం కాయం.. అయితే మోసం చేసేవాడు ఎప్పుడు ఒకే విధానంలో రావడం లేదు.. ప్రజలకంటే ఉందే అప్డేట్ అవుతున్నాడు. ఒకసారి అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపుతారు. మరోసారి ఎన్ని డబ్బులు పెడితే అంతకు డబుల్ ఇస్తామని చెబుతారు. ఇలా ఎందరినో ఎన్నో చోట్ల మోసం చేస్తుంటారు కేటుగాళ్లు. అటువంటి వారి చేతిలో చిక్కి చాలామంది ఆర్ధికంగా నష్టపోతుంటారు.

ఇక తాజాగా తాడేపల్లి కేంద్రంగా ఓ భారీ మోసం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన జగతపు జాషువా అనే వ్యక్తి తాడేపల్లి బైపాస్ రోడ్డులో స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ అనే పేరుతో ఓ ఆఫీస్ తెరిచాడు. దళితులను టార్గెట్ గా చేసుకొని మోసాలకు పాల్పడ్డాడు. కేంద్ర ప్రభుత్వం గేదెలు కొనుక్కొని స్వయంగా అభివృద్ధి చెందేందుకు దళితులకు కేంద్ర ప్రభుత్వం రూ. 1.6 లక్షల లోన్ ఇస్తుందని, మొదట లక్ష రూపాయలు డిపాజిట్ చేసిన వారికి ఈ మొత్తం ఇస్తారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీ అకౌంట్లలో పడుతుందని వివరించాడు. ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చెయ్యాలని అమాయకులను నమ్మించాడు. దింతో చాలామంది వారి దగ్గర డబ్బులు లేకున్నా అప్పు తెచ్చి మరి అతడి చేతిలో పెట్టారు. 400 మంది 4 కోట్ల రూపాయలను ఇచ్చారు. అయితే ఇంతకు డబ్బు ఖాతాల్లో పడకపోవడంతో రెండు మూడు సార్లు అడిగారు. ఏవో కారణాలు చెబుతూ దాటేసుకుంటూ వచ్చేవాడు.

అయితే గత 15 రోజులుగా కార్యాలయంలో ఎవరు కనిపించడం లేదు. దింతో బాధితులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు కట్టిన వారిలో తూర్పుగోదావరి జిల్లా మాదిగ ఐక్యవేదిక చైర్మన్ కిషోర్ బాబు కూడా ఉన్నారు. డబ్బులు కట్టి మోసపోయిన వారు లబోదిబో అంటున్నారు. అయితే జాషువా పై వివిధ రాష్ట్రాల్లో 21 కేసులు ఉన్నాయి. అతడు ఓ సారి నకిలీ పీటీ వారెంట్ తో జైలు నుంచి కూడా తప్పించుకున్నారు. అయితే గతంలో తాను చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ కూడా సృష్టించాడు. పేరు మార్చుకుని పలు ప్రాంతాల్లో తిరుగు తు ప్రజలను మోసం చేస్తున్నాడు.

దళితులను దారుణంగా మోసం చేసి రూ. 4 కోట్లతో ఉడాయించాడు.