సైబర్ నేరగాళ్ళ కొత్త పందా

15196

సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఎవరు ఊహించలేక పోతున్నారు. తీరా డబ్బు పోగుట్టుకున్నాక తాము మోసపోయామని తెలుసుకుంటున్నారు. e commer’s యాప్స్ లో షాపింగ్ చేసేవారిని టార్గెట్ గా చేసుకొని ఈ మధ్య అత్యధిక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. మీరు ఈ వస్తువు కొన్నారు.. మీకు మంచి గిఫ్ట్ వచ్చింది, మీకో ఓటీపీ వస్తుంది అది చెప్పండి అంటూ ఏర వేస్తున్నారు. కొంచం సైబర్ నేరాలపై అవగాహనా ఉన్నవారు వీటి బారినుంచి తప్పించుకుంటున్నారు. కానీ అవగాహల లేని వారు గిఫ్ట్ వచ్చింది అనగానే otp చెప్పేస్తున్నారు. ఇలా అనేకమంది మోసపోయి సైబర్ క్రైం ఠాణాకు వెళ్తున్నారు..

ఇక తాజాగా ఓ కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఐదు రూపాయల నాణెంపై దేవుడి బొమ్మ ఉంటే దానిని ఐదు లక్షలకు కొంటామని.. 10 రూపాయల నాణెంపై దేవుడి బొమ్మ ఉంటే 10 లక్షలకు కొంటామని కొందరు ఫోన్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత ఎవరైనా తమ దగ్గర ఉన్నాయని చెబితే వెంటనే మీ మొబైల్ నంబర్ కు ఒక otp వస్తుంది అది చెప్పండి మేము వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాం.. ఆ నాణేన్ని ఎవరికీ ఇవ్వకండి మా ఏజెంట్ మీ ఇంటికి వచ్చి తీసుకుంటాడని చెబుతారు.

ఆలా otp చెప్పగానే బ్యాంకు ఖాతాల్లో ఉన్నకాడికి ఊడ్చి పడేస్తారు. ఇదే తరహా దందాలో మరో కొత్త కోణం ఉంది.. మీ ఖాతాలో డబ్బు వెయ్యాలి అంటే ముందుగా జీఎస్టీతోపాటు పలు టాక్స్ లు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. దానికోసం ఇంత అంమౌంట్ కట్టాలని కోరతారు. ఆలా ఓ వ్యక్తి నుంచి రూ.39 వేలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ తర్వాత కాల్ కట్ చేశారు. ఎంత ఫోన్ చేసిన తీయకపోవడంతో సోమవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

olx విషయానికి వస్తే, ఏదైనా వస్తువు అమ్మకానికి పెడితే దాన్ని కొనేవారిలా ఫోన్ చేస్తారు. బేరం ఆడకుండానే తమకు ఇది నచ్చిందని డబ్బు పే చేస్తామని చెబుతారు. ఒక క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తాం స్కాన్ చెయ్యమని చెబుతారు. తెలియక దాన్ని స్కాన్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం లూటీ అవుతుంది. ఇటువంటి మోసాలు హైదరాబాద్ నగరంలో కోకొల్లలుగా జరిగాయి. తాజాగా జరిగిన సైబర్ మోసాన్ని గమనిస్తే,, ఓ వ్యక్తి ఓ పట్టుచీరను ఓల్స్ olx లో పెట్టాడు.

దాని రేటు రూ.8400గా ఫిక్స్ చేశారు. చీర olxలో పెట్టిన వ్యక్తికీ కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు బేరం మాట్లాడకుండానే కొంటామని చెప్పారు. ఓ క్యూఆర్ కోడు పంపుతామని దాన్ని స్కాన్ చేస్తే తాము మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని తెలిపారు. దింతో ఆ వ్యక్తి క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాడు. దింతో అతడి ఖాతాలో ఉన్న 84000 రూపాయలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. దింతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక వీటిపై అవగాహనా కల్పించేందుకు సైబర్ టీం అధికారులు ఓ వీడియో విడుదల చేశారు.

సైబర్ నేరగాళ్ళ కొత్త పందా