వాట్సాప్ ద్వారా భారీ మోసాలకు తేర..

693

సైబర్ నేరగాళ్లు డే టు డే అప్డేట్ అవుతున్నారు. గతంలో ఫోన్ చేసి ఓటీపీ అడిగేవారు. కానీ ఇప్పుడు జస్ట్ ఓ లింక్ సెండ్ చేసి మనీ కాజేస్తున్నారు. ఈ లింక్ సెండ్ చెయ్యడానికి వాట్సాప్ ను ఫ్లాట్ ఫామ్ గా చేసుకొని అమాయకులను దారుణంగా మోసం చేస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ లోని డబ్బు సైబర్ నేరగాళ్ల అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది.

ఈ సైబర్ దందా గత కొంత కాలంగా విచ్చలవిడిగా జరుగుతుంది. ఇతరదేశాల నంబర్లతో వాట్సాప్ నంబర్లకు లింక్ సెండ్ చేస్తున్నారు.. ఈ లింక్స్ కూడా యువతను ఆకర్షించేలా, నిరుద్యోగులు వెంటనే క్లిక్ చేసే విధంగా ఉంటున్నాయి. యువతులకు బ్యూటీ టిప్స్ గురించి చెబుతామని వలవేస్తున్నారు, ఇక నిరుద్యోగులకు పార్ట్ టైం జాబ్స్ అని, వేలల్లో జీతాలు ఇస్తారని లింక్స్ సెండ్ చేస్తున్నారు. ఇవి ఓపెన్ చెయ్యగానే ఆటోమాటిక్ గా సదరు వ్యక్తి అకౌంట్ లోని మనీ డెబిట్ అవుతుంది..

కాగా ఈ సైబర్ దాడులకు నైజీరియా ముఠా పాల్పడుతుందని అధికారులు గురించారు. కానీ వారు ఎక్కడినుంచి చేస్తున్నారు అనేది మాత్రం తెలియరాలేదు. ఇక సీక్రెట్ గా ఉండాల్సిన ఫోన్ నంబర్స్ ను ఎవరు సైబర్ నేరగాళ్లకు ఇస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి. అయితే పేస్ బుక్, వాట్సాప్ వంటి సంస్థలు తమ వినియోగదారుల డేటాను అప్పనంగా కొందరికి అమ్మేస్తున్నాయి.

ఇలా చెయ్యడం వల్లనే ఆ డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి ప్రజల అకౌంట్స్ లో డబ్బులు కాజేసేందుకు మార్గంలా మారిందని కొందరి వాదన. ఏది ఏమైన జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం మనమే. కొత్త నంబర్లను నుంచి వచ్చే లింక్స్ ను క్లిక్ చెయ్యకుండా, గ్రూప్స్ లో వచ్చే అనుమానిత లింక్స్ కూడా క్లిక్ చెయ్యకుండా ఉంటే మీ డబ్బును జాగ్రత్తగా కాపాడుకున్న వారవుతారు.

వాట్సాప్ ద్వారా భారీ మోసాలకు తేర..