మీకు ఇటువంటి కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త!

230

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు అప్డేట్ అవుతున్నారు. ప్రభుత్వ స్కీంల పేరుతో, బ్యాంక్ అకౌంట్స్ పేరుతో, డ్రాలో డబ్బు గెలిచారని, ఇలా వివిధ రకాలుగా ఫోన్ చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇక తాజాగా కొత్త పంధా ఎంచుకున్నారు. దేశంలో కోవిడ్ టీకా ఇస్తున్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించి కొత్త మోసానికి తెరలేపారు సైబర్ నేరగాళ్లు. డ్రగ్ అథారిటీ అఫ్ ఇండియా నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీకు వాక్సిన్ ఇవ్వాలి అంటే ముందు పేరు నమోదు చేసుకోవాలని చెబుతున్నారు.

దానికి గాను ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, చెప్పాలని, మీకో ఓటీపీ వస్తుందని అదికూడా చెబితే మీ పేరు రిజిస్టర్ అవుతుందని. త్వరలో ఆరోగ్య కార్యకర్తలు మీ ఊరుకు వచ్చి టీకా ఇస్తారని చెబుతారు. అయితే ఆదమరిచి ఓటీపీ చెబితే మీ అకౌంట్ లోని డబ్బు మొత్తం స్వాహా అనిపిస్తారు. ఇలా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి 12 లక్షలు కాజేశారు.

ఇదంతా కేవలం రెండు గంటల్లోనే జరిగిపోయింది. దింతో బాధితుడు లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. గతంలో వేరే పేర్లతో సైబర్ నేరగాళ్లు తెగబడ్డారు. ప్రజల నుంచి అప్పనంగా సొమ్ము కాజేశారు. వీరిలో కొంతమంది డబ్బును పోలీసులు వెనక్కు తీసుకురాగలిగారు, మరికొందరి డబ్బు మాత్రం తీసుకురాలేకపోయారు. అయితే ఎవరైనా ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అడిగితె చెప్పకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు పోలీసులు.

మీకు తెలియని వారు మీ డీటెయిల్స్ అడిగితె చెప్పకుండా ఉండటం మేలని వివరిస్తున్నారు. ఫేక్ కాల్స్ ని నమ్మొద్దని చెబుతున్నారు.

మీకు ఇటువంటి కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త!