పూరి గుడిసెకు లక్షా 50 వేల కరెంట్ బిల్

78

సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ ఒంటరి మహిళ ఉంటున్న ఇంటికి ఏకంగా రూ.1,49,034 కరెంట్ బిల్ వచ్చింది.. బిల్ చూసిన వృద్ధురాలికి గుండె ఆగినంత పని అయింది. లబో దిబో అంటూ చుట్టుపక్కల వారికీ చూపించింది. వారి సాయంతో విద్యుత్ అధికారుల దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుంది.. కాగా ఈ ఘటన అనంతపురం జిల్లా కణేకల్లులో చోటుచేసుకుంది. మోడల్ స్కూల్ పక్కన ఉండే కురుబ కామాక్షమ్మకు ఈ నెలకు సంబందించిన కరెంట్ బిల్ వచ్చింది.

తనకు న్యాయం చేయాలని విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఏఈఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య కారణంగా చోటు చేసుకున్న ఈ తప్పిదాన్ని సరిచేసి, వినియోగించిన యూనిట్ల మేరకే బిల్లు వసూలు చేస్తామని భరోసానిచ్చారు. మీటర్లలో ఒక్కోసారి తప్పులు దొర్లుతాయని, బిల్ మెషిన్ల సర్వర్లు పనిచేయని సమయంలో కూడా బిల్ ఈ విధంగానే వస్తుందని తెలిపారు. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.

పూరి గుడిసెకు లక్షా 50 వేల కరెంట్ బిల్