సరూర్ నగర్ చెరువులో ముసలి ప్రత్యేక్షం

255

హైదరాబాద్ మినీ ట్యాంక్ బండ్ గా పిలుచుకునే సరూర్ నగర్ చెరువులో మొసలి ప్రత్యేక్షమైంది. గ్రీన్ పార్క్ కాలనీ సమీపంలో నీటిలో ఉన్న థర్మాకోల్ సీట్ పైకి ఎక్కి ఉన్న మొసలిని అటుగా వెళ్తున్న వారు గమనించారు. వెంటనే తమ సెల్ ఫోన్స్ తీసి కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చెరువుకు ఆనుకొని పుర్తిగా ఇళ్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

అధికారులు స్పందించి చెరువులోని మొసలిని పట్టుకెళ్లాలని కోరుతున్నారు. ఇక ఇప్పటికే అటవీశాఖ, పోలీస్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. మరి మొసలి పట్టుకుంటారా? లేదా? అనే దానిపై అధికారుల నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే పక్కనే ప్రియదర్శిని పార్క్ ఉండటంతో అక్కడికి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఇదే చెరువులో బోటింగ్ కూడా ఉంటుంది. మొసలి విషయం తెలియడంతో బోటింగ్ నిర్వాహకులు కూడా ఆందోళన చెందుతున్నారు.

సరూర్ నగర్ చెరువులో ముసలి ప్రత్యేక్షం