హడలెత్తించిన మొసలి.. పంటపొలాల్లో ప్రత్యక్షం!

80

రైతు కూలీలు ఉదయాన్నే యధావిధిగా వరిలో కలుపుతీద్దామని పంటచేలోకి దిగారు. అంతే ఒక్కసారిగా భారీ మొసలి ఒకటి చేలోనే నోరు తెరవడంతో కూలీల గుండె ఆగినంత పనైంది. చుట్టుపక్కల చేలల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు అందరూ మొసలి ఉన్న చేను దగ్గర చేరి చాకచక్యంగా ఆ మొసలిని పట్టేసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునగాల్ చెడ్ గ్రామంలో చోటుచేసుకుంది.

తొలుత వరి పంట పొలాల్లో మొసలి ప్రత్యక్షం కావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని స్థానిక రైతులంతా కలిసి చాకచక్యంగా తాళ్లతో మొసలిని బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలిని ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకోగా దాన్ని కృష్ణా నదిలో వదలనున్నట్లు తెలిపారు. సమీపంలో ఉన్న వాగు నుంచి మొసలి పంటపొలాల్లోకి వచ్చినట్లు రైతులు భావిస్తుండగా అటవీశాఖ అధికారులు.. ఆ వాగు, మొసలిపై దృష్టిపెట్టి దర్యాప్తు చేస్తున్నారు.

హడలెత్తించిన మొసలి.. పంటపొలాల్లో ప్రత్యక్షం!