నీటికొచ్చిన చిరుతను, వేటాడిన మొసలి

100

ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువు చిరుత,, దీని గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు. తనకు కావలసిన ఆహారాన్ని యిట్టె పట్టుకుంటుంది. చిరుత చెట్లు ఎక్కడంలో నేర్పరి. అంతే కాదు ఈదడం కూడా బాగా తెలుసు. అయితే ఇన్ని లక్షణాలున్న ఓ చిరుత మొసలి పట్టుకు ప్రాణం విడిచి దానికి ఆహారంగా మారింది.

ఒకటి ఆహారం కోసం, మరొకటి ప్రాణం కాపాడుకునేందుకే చేసిన పోరాటంలో ఆహారం కోసం పోరాటం చేసిన మొసలి విజయం సాధించింది. చిరుత ఓడి మొసలి ఆకలికి ఆహారంగా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేకుంది. ఈ భయంకర వీడియోను దక్షిణాఫ్రికా వైల్డ్‌ ఎర్త్‌ సఫారి గైడ్‌ బుసాని మ్థాలీ.. అండ్‌ బియాండ్‌ ఫిండా ప్రైవేట్‌ గేమ్‌ రిజర్వ్‌ వద్ద తీశారు.

దాహంతో ఉన్న మూడు చిరుతలు ఓ కుంట దగ్గరకు వెళ్లాయి. అయితే అప్పటికే ఆ నీటి లోపల 13 అడుగుల పొడవైన నైలు మొసలి దాక్కొని ఉంది. దానిని గమనించని చిరుత నీటిని తాగుతుండగా ఒక్కసారిగా మొసలి బయటకి వచ్చి తన నోటితో చిరుత గొంతు కరుచుకొని ఆమాంతం నీటిలోకి లాక్కెళ్లింది. ఈ వీడియో చూడటానికి చాలా భయంకరంగా ఉంది.

కొన్ని క్షణాల్లోనే చిరుత మొసలి మెరుపు దాడికి బలైంది. ఈ వీడియో ను కోటి మందికి పైగా వీక్షించారు. కాగా ఆఫ్రికా ఖండంలో నైలు ముసలి చాలా పెద్దది. ఇవి భారీగా ఉండే నీటి ఏనుగులు, ఖడ్గ మృగాలతో తలపడుతుంటాయి.