క్రికెట్ ఆడుతూ చనిపోయిన బ్యాట్స్ మెన్.. వీడియో

191

జీవితం శాశ్వతం కాదు.. ఎవరి ప్రాణాలు ఎక్కడ ఎప్పుడు పోతాయో తెలియదు. ఒక్కోసారి మన కళ్ళముందు నుంచి వెళ్లిన వ్యక్తులే కాసేపటి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోతుంటారు. ఉన్న చోటే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది అటువంటి ఘటనే.. నిల్చున్నచోటే ఓ వ్యక్తి కుప్పకూలి పడిపోయి మృతి చెందాడు. క్రికెట్ ఆడుతూ ప్రాణాలు విడిచాడు.. అప్పటివరకు నిటారుగా నిలబడి ఉన్న ప్లేయర్ కింద కూర్చొని, ఆ తర్వాత కుప్పకూలిపోయాడు. ఏమైందో అని చూసే లోపే ప్రాణాలు విడిచాడు.. ఈ హృదయ విదారక ఘటన పూణేలోని జున్నార్ మండలంలో చోటు చేసుకుంది.

జున్నార్ మండల కేంద్రంలోని ఓ మైదానంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 10 పైగా జట్లు వచ్చాయి. పోటీలు ప్రారంభమయ్యాయి.. ఓ జట్టు బ్యాటింగ్ కి దిగింది.. ఇంతలోనే ఓ అలజడి. నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్ మన్ హఠాత్తుగా కూలిపోయాడు. దింతో గౌండ్ లో ఉన్న ఆటగాళ్లు పరిగెత్తుకుంటూ అతడి దగ్గరకు వచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడిపేరు బాబు నలవాడేగా తెలుస్తుంది. ఇక ఈ దృశ్యాలను అక్కడి ఉన్నవారు తమ ఫోన్ లో బంధించారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియో చూసిన వారి బాధతో కామెంట్స్ చేస్తున్నారు.

క్రికెట్ ఆడుతూ చనిపోయిన బ్యాట్స్ మెన్.. వీడియో