D Raja : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాకు అశ్వస్థత.

291

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అస్వస్థతకు గురయ్యారు. శనివారం హైదరాబాద్ లో ఆ పార్టీ కార్యాలయంలో జాతీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు రాజా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దింతో ఆయనను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన డాక్టర్లు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని, వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వివరించారు డాక్టర్లు

D Raja : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాకు అశ్వస్థత.