అర్ధరాత్రి నగరంలో పర్యటించిన సీపీ సజ్జనార్

59

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి నగరంలో చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 మందికిపైగా పట్టుపడ్డారు. ఇక ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ అర్ధరాత్రి బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టుల వద్దకు వెళ్లి పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎన్ని గంటలు నిర్వహిస్తున్నారు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు.. ఎంత మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతున్నారు..

అనే విషయాలను స్వయంగా పరిశీలించి, సూచనలు, సలహాలు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి, పదేళ్లు జైలు శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికే వారి వివరాలను వారి ఆఫీసుల్లో సమాచారం ఇస్తాం అన్నారు . కాగా గతంలో కూడా ఇదే విధంగా ఆఫీస్ లలో సమాచారం ఇచ్చేవారు. ఇలా చేయడంతో కొందరు ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇక డిసెంబర్ 31వ తేదీ రాత్రి 200 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. తాగి బండి నడిపే వారిపై కేసులు పెట్టాలని గట్టి ఆదేశాలు జారీ చేశారు.