Cow dung:- ఆమ్మో పేడ దొంగలు.. ఆదమరిస్తే పేడను ఎత్తుకెళ్తున్నారు

173

పేడ దొంగలు ఏంటి అని ఆర్చర్యపోతున్నారా? అవును మీరు చూసింది నిజమే.. పేడను కూడా దొంగిలిస్తున్నారు కొందరు.. దీని వెనక పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే పేడ అమ్మితే కేజీకి రూ.2 ఇస్తానని తెలిపింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. దింతో చాలామందికి ఇది ఉపాధిగా మారింది. ఆవుల సంతతిని పెంచే కార్యక్రమంలో భాగంగా 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద కేజీ ఆవు పేడను రూ. 2కు కొనుగోలు చేస్తారు. దింతో పేడ దొంగలు తయారయ్యారు. దొరికిన కాడికి దోచుకుంటున్నారు.

పేడను దొంగతనం చేస్తూ దొరికిన ఐదుగురు మహిళల నుంచి పోలీసులు ఏకంగా 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా, అంబికాపూర్ మునిసిపాలిటీలో ప్రభుత్వ గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. ఇక పేడ దింగతనాలను అరికట్టేందుకు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ కాపలా కూడా పెట్టాలని నిర్ణయించారు.

Cow dung:- ఆమ్మో పేడ దొంగలు.. ఆదమరిస్తే పేడను ఎత్తుకెళ్తున్నారు