Covid – 19 : కరోనా సోకి 162 డాక్టర్లు, 107 నర్సులు, 44 ఆశా వర్కర్లు మృతి.

117

కరోనా మహమ్మారి ఏడాది పాటు దేశాన్ని అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లాక్ డౌన్ పెట్టించి ప్రజలను ఇంటికే పరిమితం చేసింది. దేశంలో ఒక లక్ష 50 వేలమందిని పొట్టన పెట్టుకుంది. ఇక దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి కారణంగా 162 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హెల్త్‌కేర్ రంగానికి సంబంధించి వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లలో ఇప్పటివరకు ఎంత మంది మృతిచెందారని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే సమాధానం ఇచ్చారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌కు అందిన సమాచారం ప్రకారం జనవరి 22 నాటికి దేశంలో 162 మంది వైద్యులు, 107 మంది నర్సులు, 44 మంది అశా వర్కర్లు కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందారని మంత్రి తెలిపారు. ఈ మహమ్మారి బారినపడి పోలీసులు కూడా మృతి చెందారు. ఎందరో ప్రముఖులు కరోనా కాటుకు బలైపోయారు. వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకరు. చాలామంది రాజకీయ నేతలు కూడా కరోనా కాటుకు మృతి చెందారు.

Covid – 19 : కరోనా సోకి 162 డాక్టర్లు, 107 నర్సులు, 44 ఆశా వర్కర్లు మృతి.