కొడాలి నానికి అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

242

ఎన్నికల సమయంలో మీడియాతో మాట్లాడకూడదని పలువురు వైసీపీ నేతలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.. వీరిలో మంత్రి కొడాలి నాని కూడా ఉన్నారు. కాగా నిమ్మగడ్డ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నాని హైకోర్టుకు వెళ్లారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, గురువారం తీర్పు వెలువరించింది. మీడియాతో మాట్లాడొచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు షరతులు విధించింది హైకోర్టు.. ఎన్నికల కమిషన్‌, ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడొచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులు స్పష్టంచేశారు. కాగా నిమ్మగడ్డ జారీచేసిన ఉత్తర్వులలో పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యే వరకు, అంటే ఫిబ్రవరి 21 వరకు నాని మీడియాతో మాట్లాడకూడదని ఉంది. ఇక హైకోర్టు ఉత్తర్వులతో నాని ప్రెస్ మీట్ పెట్టనున్నారు.

కొడాలి నానికి అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు