అఖిల ప్రియకు బెయిల్ మంజూరు

324

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏ-1 నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్‌ మంజూరైంది. సికింద్రాబాద్‌ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా 17 రోజులుగా అఖిలప్రియ చంచల్ గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఇక ఆమె భారత్ భార్గవ రామ్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్ట్ తిరస్కరించింది. ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చిన నాటినుంచి భార్గవ్ రామ్ అజ్ఞాతంలో ఉన్నారు.

ఇక ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇక అఖిలప్రియకు బెయిల్ ఇస్తూ షరతులు విధించింది కోర్టు. 15 రోజులకు ఒకసారి బోయిన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు ఆమెకు సూచించింది. అఖిలప్రియ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అఖిల ప్రియకు బెయిల్ మంజూరు