వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్య

117

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యారు. కాకినాడ 9 వార్డు కార్పొరేటర్ గా ఉన్న కంపరా రమేష్ కాకినాడ వాకపూడి గానుగచెట్టు సెంటర్ వద్ద గల కార్ వాష్ షెడ్ ఎదురుగా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హత్యకు ముందు రమేష్ ఇదే కార్ వాష్ షెడ్ లో మిత్రులతో కలసి మద్యం సేవించారు. అనంతరం అందరు కలిసి ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి రమేష్ ను డీకొంది.. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే హత్యకు కారణంగా తెలుస్తుంది.