కృష్ణా జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం

47

కృష్ణాజిల్లాలో కరోనావైరస్‌‌ వ్యాక్సిన్‌ డ్రై రన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రకాశ్ నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. విజయవాడ జీజీహెచ్‌, ఉప్పులూరు పీహెచ్‌సీ, ప్రకాష్‌ నగర్‌ ఆస్పత్రి, పూర్ణ హార్ట్‌ ఆస్పత్రి, కృష్ణవేణి కళాశాలలో డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు.

కాగా డ్రై రన్ కార్యక్రమం సందర్బంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ డ్రై రన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మంగళవారం రియల్ టైం లో వ్యాక్సిన్‌ను అందించేందుకు ఈరోజు చేసిన ఏర్పాట్లు ఉపయోగపడతాయని అన్నారు. ఈ ప్రక్రియలో మొత్తం 125 మందితో డ్రై రన్‌ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.