తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు, 3 మరణాలు..

74

తెలంగాణలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 2,69,828 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 7,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. అటు గడిచిన 24 గంటల్లో 596 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ముగ్గురు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1499కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 48,005 శాంపిల్స్ పరీక్షించారు. దాంతో రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 62,05,688కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 21, జీహెచ్ఎంసీ 102, జగిత్యాల 10, జనగాం 5, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల్ 0, కామారెడ్డి 4, కరీంనగర్ 29, ఖమ్మం 24, నల్గొండ 18, నారాయణపేట 3, నిర్మల్ 10, ఆసిఫాబాద్ 07, మహబూబ్ నగర్ 10, మహబూబాబాద్ 8, మంచిర్యాల 15, మెదక్ 7, మేడ్చల్ 33, ములుగు 12, నాగర్ కర్నూల్ 9, నిజామాబాద్ 11, పెద్దపల్లి 15, రాజన్న సిరిసిల్ల 5, రంగారెడ్డి 35, సంగారెడ్డి 4, సిద్ధిపేట 7, సూర్యాపేట 13, వికారాబాద్ 8, వనపర్తి 22, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 28, యదాద్రి భువనగిరిలో 13 కేసులు నమోదయ్యాయి.