దేశంలో కరోనా తగ్గుముఖం, గత 24 గంటల్లో కేవలం..

59

సోమవారం దేశంలో 16 వేల 72 కేసులు మాత్రమే వచ్చాయి. ఈ సంఖ్య జూన్ 23 నుండి అత్యల్పం అని గమనించవచ్చు.. ఆరోజు 15 వేల 656 కేసులు నమోదు అయ్యాయి. ఇక గత 24 గంటల్లో 24 వేల 822 మంది రోగులు నయమయ్యారు. 250 మంది రోగులు మరణించారు. ఇప్పటివరకు మొత్తం 1.02 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 98.06 లక్షల మంది రోగులు నయమయ్యారు. 1.48 లక్షల మంది రోగులు మరణించారు. ప్రస్తుతం 2.67 లక్షల మంది రోగులు క్వారంటైన్ లో ఉన్నారు.

ఇదిలావుంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన సంవత్సర వేడుకలను పర్యవేక్షించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాసిన ఈ లేఖలో దేశంలో కొత్త కరోనా కేసులు, క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల, జాగ్రత్త అవసరం అని.. తప్పనిసరి అయితే స్థానిక స్థాయిలో నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధించుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.