Corona virus: తెలుగు రాష్ట్రాల్లో మరో భిన్నమైన మహమ్మారి!

184

Corona virus: కరోనా వైరస్.. ఈ పేరు వినిపిస్తే చాలు వెన్నులో వణుకుపుట్టే వాళ్లకు కొదువేలేదు. మనల్నే కాదు యావత్ ప్రపంచాన్ని ఉన్న చోట నుండి కదలకుండా చేసిన ఘనత ఈ మహమ్మారి సొంతం. గత ఏడాది చివరి అంకంలో కరోనాకు కొత్త రకాలు కూడా పుట్టుకురాగా అవి మరింత ప్రభావవంతమైనవిగా కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహమ్మారికి తొలిదశ వ్యాక్సినేషన్ కూడా మొదలు కాగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే.. గత ఏడాది చివర్లో వచ్చిన కొత్త కరోనా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిందని విన్నాం కానీ ఇప్పుడు మరో భిన్నమైన వైరస్ మరొకటి ప్రవేశించిందని చెప్తున్నారు.

అయితే.. ఇది కొత్త రకం మాత్రం కాదని… ఇప్పటికే ఉన్న వైరస్​ బలహీనపడటం వల్ల ఉత్పన్నమైన భిన్న రకమని చెప్తున్నారు. ఈ రకం వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధరించేందుకు నిపుణుల పరిశోధనను ముమ్మరం చేయనుండగా దీనిపై కూడా ప్రజలకు అవగాహనా కల్పించడమే మంచిదంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణ భారతదేశంలో భిన్నమైన కరోనా వైరస్‌ ఎక్కువగా కనిపిస్తోందని ఇక్కడి సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కానీ.. ఇది కరోనా.. గత ఏడాది చివర్లో వచ్చిన కొత్త కరోనా కన్నా ఒకింత బలహీనంగా ఉందని CCMB సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చెప్పారు. దీనికి ఎన్‌440కే అని పేరు పెట్టగా గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో స్వల్ప కేసుల్లో కనిపించగా ఇప్పుడు ఎక్కువ మందికి ఇది వ్యాప్తి చెందుతోందని ఆయన చెప్పారు. ఎన్‌440కే రకం వల్ల వ్యాధి లక్షణాలు పెద్దగా ఉండవని.. మునుపటి వైరస్‌ బలహీనపడటం వల్ల ఇదిఉత్పన్నమై ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ వైరస్ పై ఎక్కువస్థాయి డేటా అందుబాటులో లేదన్న మిశ్రా పరిశోధనల అనంతరం దీనిపై వివరాలు చెప్తామన్నారు.