Corona Vaccine: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్.. ధర ఎంతంటే?

286

Corona Vaccine: మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండో విడత వ్యాక్సినేషన్ చివరి దశలో ఉండగా మూడో విడతకు కేంద్రం సన్నాహాలు పూర్తిచేస్తుంది. మార్చి 1 నుంచి సీనియర్ సిటిజన్లను కరోనా టీకాలు వేసేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరితో పాటూ 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా టీకాలు వేసేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే.. ఈ దశలో ప్రైవేట్ సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.

ఈ దశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో కరోనా టీకా డోసు ధరను రూ.250గా కేంద్రం ఖరారు చేసినట్లుగా తెలుస్తుండగా దీనికి రూ.100ల సర్వీస్ ఛార్జ్ అదనంగా చెల్లించాలని చెప్తున్నారు. సర్వీస్ చార్జీను లబ్ధిదారులు ఆస్పత్రి వర్గాలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం టీకాలు ఉచితంగానే లభించనున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ ఖరారు చేసిన ఈ ధరలను రాష్ట్రాల పరిశీలనకు పంపినట్టు సమాచారం. తొలి రెండు విడతల్లో కేంద్ర ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు అందించింది. మూడో విడతలో వృద్ధులకు టీకా పంపిణీ చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది.

Corona Vaccine: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్.. ధర ఎంతంటే?