కెనడాకు 10 లక్షల డోసులు

173

కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని విడిచి వెళ్ళలేదు. ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు కరోనాతో మృతి చెందుతున్నారు. పలు దేశాల్లో కొత్త రకం కరోనా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. కరోనాను పారదోలేందుకు అనేక దేశాలు టీకాలు కనిపెట్టాయి. కానీ భారత్ టీకాకు ఉన్న డిమాండ్ ఇతర దేశాల టీకాలకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అనేక దేశాలు భారత్ నుంచి టీకా కొనుగోలు చేసాయి. మొదట భారత సరిహద్దు దేశాలకు టీకా పంపారు. పాకిస్తాన్, చైనా మినహా సరిహద్దు దేశాలన్నింటికీ భారత్ టీకా పంపింది. ఇక బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా భారత్ టీకానే ఎక్కువగా వాడుతున్నారు.

ఇదిలా ఉంటే తమకు భారత వ్యాక్సిన్ కావాలని కెనడా కోరింది. దింతో భారత్ ప్రభుత్వం 10 లక్షల డోసులను కెనడాకు పంపేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోడీ అధికారులతో మాట్లాడారు. డెలివరీ త్వరగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఇప్పటివరకు 80కి పైగా దేశాలకు భారత్ వ్యాక్సిన్ అందించింది. ఇక కరోనాని ఎదురుకోవడంలో కూడా భారత్ విజయం సాధించిందని చెప్పవచ్చు.

 

అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పిట్టల్లా రాలిపోయారు కరోనా రోగులు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగనే చెప్పవచ్చు. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో సుమారు కోటి మంది మాత్రమే కరోనా భారిన పడ్డారు. అంటే ఇది ఒక శాతానికి తక్కువే . అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 10 శాతం మంది ప్రజలు కరోనా భారిన పడ్డారు. కరోనాతో మృతి చెందిన వారిసంఖ్య కూడా అమెరికా, బ్రిటన్ దేశాల్లో అధికంగా ఉంది.

కెనడాకు 10 లక్షల డోసులు