మద్యం ప్రియులకి బాడ్ న్యూస్.. వ్యాక్సిన్ వేయించాక రెండు నెలలు నో లిక్కర్

108

 

కోవిడ్ – 19 మహమ్మారి అన్ని రంగాల వారిని అతలాకుతలం చేసింది. దేశంలో 9 నెలలుగా కరోనా కాటుకు లక్షమందికిపైగా బలైయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. టీకా కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే రష్యా, చైనా, బ్రిటన్ దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది. అక్కడ పౌరులకు టీకా వేయడం ప్రారంభించారు. రష్యా పౌరులకు ఆ దేశం స్పుత్నిక్ వి వ్యాక్సిన్ టీకాలు వేస్తుంది. అయితే ఈ టీకా వేయించుకున్నవారు రెండు నెలల వరకు మద్యం సేవించకూడదని డాక్టర్లు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది.

ఇక ఇదే విషయమై రష్యా ఉప ప్రధాని టటియానా గోలికోవా కూడా ప్రజలకు హెచ్చరికలు పంపారు. టీకా తీసుకున్న తర్వాత రెండు నెలల వరకు మద్యం తాగకూడదని తెలిపారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ టీకా శరీరంలో కలిసిపోయి చురుకుగా అయి సర్దుకోవడానికి రెండు నెలల సమయం పడుతుండట. దీంతోప్రజలు సురక్షితంగా ఉండటానికి ఈ మార్గదర్శకాలు జారీ చేశారని అంటున్నారు.