వారం రోజుల్లో తెలంగాణకు కరోనా వ్యాక్సిన్

1314

తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు హెల్త్‌ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు. వారం రోజుల్లో తెలంగాణకు కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2.60 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు తొలిదశ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 5 కోట్ల డోసులు భద్రపరిచేలా ఫ్రీజర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తెలంగాణలో అందుబాటులో 850 కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్నాయన్నారు. తొలిదశలో 5 లక్షలమంది ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు 75 లక్షలమంది ప్రజలకు తొలిదశలో టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు శ్రీనివాసరావు. వ్యాక్సిన్ రియాక్షన్ పై ప్రత్యేక శ్రద్దపెట్టినట్లు చెప్పారు. వృద్ధులు, వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారని పేర్కొన్నారు శ్రీనివాసరావు.