జనవరిలోనే కరోనా వ్యాక్సినేషన్

67

కరోనా మహమ్మారిని దేశం నుంచి పారదోలేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు. జనవరిలో ఏ వారంలో అయినా వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. టీకా సామర్ధ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలిపారు. రానున్న ఆరు ఏడు నెలల్లో 30 కోట్లమందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు హర్షవర్ధన్.

వ్యాక్సిన్ ను అభివృద్ధి చెయ్యడంలో భారత శాస్త్రవేత్తల పనితనం అమోఘమైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్‌, కోవాక్సిన్‌, జైకోవ్‌-డి, స్పుత్నిక్‌ వి, ఎన్‌విఎక్స్‌ వంటి టీకాలు ట్రయల్స్‌ దశలో ఉండగా.. మరో మూడు ప్రీ క్లినికల్‌ దశలో ఉన్నాయి. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది, 96 లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాలు ఒక లక్ష 50 వేలకు చెరువుల్లో ఉన్నాయి. కరోనా వలన మహారాష్ట్రలో అత్యధికమంది మృతి చెందారు.

జనవరిలోనే కరోనా వ్యాక్సినేషన్