Corona vaccination : వ్యాక్సిన్ తీసుకున్న నర్సు కి ఫిట్స్

49

దేశంలో 20 లక్షల మందికి పైగా ఫ్రెంట్ లైన్ వారియర్స్ కి కరోనా టీకా ఇచ్చారు. టీకా పనితీరు భేష్ అని దేశ వైద్యులతోపాటు విదేశాల నుంచి కూడా ప్రశంశలు అందుతున్నాయి. ఇక టీకా తీసుకున్న వారిలో కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. కళ్ళు తిరగడం, వంటి స్వల్ప అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే 20 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే.. చిన్నపాటి అస్వస్థతకు గురైన వరకు 100 మంది వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వీరు భయపడటం వల్లనే ఈ విధంగా జరుగుతుందని టీకా దుష్ప్రభావం వలన కాదని వైద్యులు చెబుతున్నారు.

ఇక టీకా తీసుకున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు గుండెపోటుకు గురికాగా, మరో మహిళా బ్రెయిన్ డెడ్ తో మృతి చెందారు. వీరికి పరీక్షించిన డాక్టర్లు టీకా ప్రభావం వలన మృతి చెందలేదని తెలిపారు. ఇదిలా ఉంటె కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓస్టాఫ్ నర్సు అస్వస్థతకు గురైంది. ఆంధ్రా ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న పద్మజ ఉదయం 11:30 అదే ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. మధ్యాహ్నం 01:30 నిమిషాలకు ఫీట్స్ లాగ వచ్చి కిందపడిపోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దింతో ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు వైద్యులు. ప్రాణాపాయం లేదని తెలిపారు. మెరుగైన చికిత్స అందజేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని తెలిపారు. టీకా విషయంలో ఎవరు భయపడవద్దని తెలిపారు.

Corona vaccination : వ్యాక్సిన్ తీసుకున్న నర్సు కి ఫిట్స్