Breaking : యూకే నుంచి భారత్ వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్

183

బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ పై అంతా భయబ్రాంతులకు గురవుతున్న సమయంలో యూకే నుంచి భారత్ వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ప్రయాణికుల్లో ఐదుగురికి, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే ఇది కరోనా కొత్త స్ట్రెయినో కాదో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. వీరి శాంపిల్స్ ను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు పంపించారు. అలాగే చెన్నైలో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను పరిశీలించారు. అలాగే లండన్ ప్రయాణికులతో సంబంధం ఉన్న 1088 మందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయాలనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.