దక్షిణాఫ్రికాలో కొత్తరకం కరోనా వైరస్, బ్రిటన్ కంటే వేగంగా విస్తరిస్తుంది.

60

కరోనా కొత్తరకం వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇది ఇప్పటికే ఇండియాకు చేరినట్లు తెలుస్తుంది. ఈ కరోనా కొత్తరకం వైరస్ బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో వేగంగా ప్రభలుతున్నట్లు ఆయా దేశ ప్రభుత్వాలు చెబుతున్నాయి. బ్రిటన్ వైరస్ కంటే దక్షిణాఫ్రికా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ సాధారణ కరోనా వైరస్ కంటే 70 శాతం అధిక వేగంతో విస్తరిస్తుండగా, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్తరకం బ్రిటన్ వైరస్ కన్నా వేగంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించింది.

మరోవైపు ఈ రెండు కొత్తరకం కరోనా వైరస్ లతో భారత్ కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించినట్లు సమాచారం. చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు బ్రిటన్ నుంచి వచ్చిన కొందరిలో లక్షణాలు గుర్తించినట్లు తెలుస్తుంది. దింతో వీరిని ప్రత్యేక గదుల్లో ఉంచారు. మరోవైపు బ్రిటన్ నుంచి వచ్చిన వారిని పరీక్షల నిమిత్తం 8 గంటల పాటు విమానాశ్రయంలోనే ఉంచుతున్నారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నెగటివ్ ఉంటే హోమ్ ఐసొలేషన్ కు పంపుతున్నారు. పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తున్నారు.

కరోనా కొత్తరకం వైరస్ తో దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అలెర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి పరీక్షలు చెయ్యాలని తెలిపారు. రిపోర్ట్ వచ్చే వరకు ఎవరిని బయటకు పంపకూడదని హెచ్చరించారు. కాగా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను ఈ నెల 22 నే నిలివేసింది ప్రభుత్వం. ఈ నిషేధం 31 వరకు ఉండనుంది. పరిస్థితి బట్టి నిషేధం పెంచే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాలో కొత్తరకం కరోనా వైరస్, బ్రిటన్ కంటే వేగంగా విస్తరిస్తుంది.