తెలంగాణలో 6 చోట్ల కరోనా వ్యాక్సిన్ డ్రై రన్

60

నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరగబోతోంది. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డ్రై రన్ జరిగింది. డ్రై రన్ జరిగిన రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. శనివారం తెలంగాణలో 6 చోట్ల డ్రై రన్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇస్తారు. ఇందులో కరోనా వ్యాక్సిన్ లాంటి డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. తద్వారా నిజమైన వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఎలా ఇవ్వాలో ట్రయల్ రన్ ఇవాళ వేసుకుంటారు.

GHMC పరిధిలో తిలక్‌నగర్ UPHC, నాంపల్లి ఏరియా హాస్పిటల్, సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జానంపేట PHC, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి, నేహా షైన్ హాస్పిటల్ లను డ్రై రన్ కోసం ఎంచుకున్నారు. ఇక్కడ ప్రత్యేక డ్రై రన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి డూప్లికేట్ వ్యాక్సిన్ ఇస్తారు. తెలంగాణ మొత్తంలో 150 మంది వాలంటీర్లకు ఈ రోజు డూప్లికేట్ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ 150 మంది ఇంతకూ ముందే పేర్లు నమోదు చేసుకొని ఉన్నవారు.