కరోనా వేళ భారీగా కండోమ్స్ అమ్మకాలు

187

ఓ వైపు కరోనా మహమ్మారి మనిషికి కొత్త జీవన విధానాన్ని నేర్పింది. చాలామంది జీవితంలో ఎప్పుడు వాడని వాటిని వాడేలా చేసింది. శానిటైజర్ అంటే తెలియని వారు కూడా దాన్ని వాడేలా చేసింది. గ్లౌజ్ వేసుకుంటామని అనుకోని వారి చేతులకు గ్లౌజులు తొడిగింది. మాస్క్ నిరంతరం పెట్టుకోవాలని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నేను మీ దరిచేరనని సూచనలు చేసింది.

ఇక మరోవైపు కరోనా సమయంలో కొత్త రికార్డ్ ఒకటి క్రియేట్ అయింది. దేశంలో గతంలో ఎన్నడు లేనంతగా కండోమ్స్ అమ్మకాలు జరిగాయి. ఈ వివరాలను సర్వీస్ యాప్ డుంజో తెలిపింది. తమకు ఈ ఏడాది అత్యధికంగా కండోమ్ ఆర్డర్స్ వచ్చినట్లు వెల్లడించింది.

లాక్ డౌన్ లో కండోమ్స్

లాక్ డౌన్ లో కండోమ్స్ ను అధికంగా వాడారు. కొత్త దంపతులు ఇప్పుడున్న పరిస్థితిల్లో పిల్లలను కనడం శుభసూచకం కాదని భావించి కండోమ్స్ ను ఉపయోగించినట్లు తెలుస్తుంది. మరోవైపు కరోనా కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో జననాల రేటు అధికంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్పడంతో దీనిని దృష్టిలో ఉంచుకొని భార్యాభర్తలు జాగ్రత్త పడినట్లుగా సమాచారం. ఇక కండోమ్స్ ఆర్డర్స్ రాత్రిపూట కంటే పగలే అధికంగా వచ్చినట్లు డుంజో తెలిపింది. దేశంలో అత్యధిక కండోమ్స్ భాగ్యనరంలోనే అధికంగా అమ్ముడుపోయాయట.. కండోమ్స్ ఆర్డర్లు భాగ్యనగరంలో ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయట. చెన్నైలో 5 రెట్లు, జైపూర్‌లో 4 రెట్లు, ముంబై, బెంగళూరుల్లో రెండు రెట్లు కండోమ్స్ కోసం ఆర్డర్లు చేసినట్లు డుంజో చెబుతోంది.

గర్భనిర్ధారణ కిట్స్ అమ్మకాలు కూడా అధికంగా పెరిగాయని తెలిసింది. ఈ విధంగా అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా వర్క్ ఫ్రొం హోమ్ అని తెలుస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అత్యధికమంది ఇంటి నుంచే అణిచేశారు. ఇతర రంగాల ఉద్యోగులు కూడా ఇంట్లోంచి పనిచేశారు.

కరోనా వేళ భారీగా కండోమ్స్ అమ్మకాలు