బ్రెజిల్ లో మృత్యుఘోష.. 1641 మంది మృతి

853

ప్రపంచాన్ని కరోనా కకావికలం చేస్తుంది. మహమ్మారి వచ్చి ఏడాదిన్నర అయింది. అయినా దీని ప్రభావం తగ్గలేదు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా ఇతర దేశాల్లో మాత్రం గతంలో ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి. బ్రెజిల్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు కేవలం 24 గంటల వ్యవధిలో 1,641 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రెజిల్ సర్కారు దేశంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైందని మంగళవారం రాత్రి ప్రకటించింది.

దేశంలో పరిస్థితి మరింత విషమించకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతన్నారు. మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని, ప్రజలు కోవిద్ నిబంధనలు పాటించేలా కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. ప్రస్తుతం కరోనా విస్తృతితో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని తెలిపారు. కాగా, తాజా మరణాలతో కలిపి బ్రెజిల్‌లో కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 2,57,361కి చేరింది.

బ్రెజిల్ లో మృత్యుఘోష.. 1641 మంది మృతి