ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

48

ఏపీలో కరోనా కేసులు దాదాపు అదుపులోకి వచ్చాయి.. గత 24 గంటల్లో 40,295 శాంపిల్స్‌ ని పరీక్షించగా 214 మంది కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో కోవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక గడచిన 24 గంటల్లో 422 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,76,042 పాజిటివ్ కేసులకు గాను 8,64,972 మంది డిశ్చార్జ్ కాగా.. 7,078 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 3,992 మంది ఉన్నారు.