నూడిల్స్ బండి వద్ద వివాదం.. వ్యక్తిపై కర్రతో దాడి

209

ఇద్దరి మిత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. కాగా ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని ఎర్రగుంటపాలెం మండలం వీరాయపాలెం గ్రామానికి చెందిన తిరుపాల్, లేళ్ళపల్లెకు చెందిన నాసరరెడ్డి ప్రాణస్నేహితులు. ఇద్దరు కలిసి గురువారం మిట్టపాలెంలో ఓ నూడిల్స్ షాప్ వద్ద మద్యం సేవించారు. ఇక్కడే వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది ముదిరి ఘర్షణకు దారి తీసింది. దింతో తిరుపాల్, పక్కనే ఉన్న మంచం పట్టెతో నాసరరెడ్డి తలపై బలంగా కొట్టాడు.

దింతో నాసరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దింతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నాసరరెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుపాల్ ను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. కాగా వీరి మధ్య గొడవ జరగడానికి గల కారణం తెలియరాలేదు.. కాగా మద్యం మత్తులో ప్రాణస్నేహితుడిని హత్య చేయడం కలకలం రేపుతోంది.

నూడిల్స్ బండి వద్ద వివాదం.. వ్యక్తిపై కర్రతో దాడి