కానిస్టేబుల్ అదృశ్యం

227

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ జలీల్‌ పటేల్‌ అదృశ్యమయ్యాడు. తన కొడుకు కనిపించడం లేదంటూ జలీల్ తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే గుండాలలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జలీల్‌ పటేల్‌ను నల్గొండకు బదిలీ చేశారు. దీంతో తనను అన్యాయంగా బదిలీ చేశారని, నల్గొండకు వెళ్లడం తనకు ఇష్టం లేదని ఈ నెల 15న జలీల్‌ తన సోదరుడు రశీద్‌ పటేల్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్‌ చేశాడు. అప్పటి నుంచి జాడ తెలియడం లేదు. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు జాడను కనుగొనాలని పోలీసులను వేడుకున్నాడు. అయితే బదిలీ ఇష్టం లేక జమీల్ పటేల్ ఎటైనా వెళ్లి ఉంటారని తండ్రి చెబుతున్నాడు.

కానిస్టేబుల్ అదృశ్యం