పక్కింటి మహిళపై కన్నేసిన కానిస్టేబుల్

61

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో గల రెడ్డి బస్తీలో నివసించే గిరిజన మహిళ మూడేళ్ళ క్రితం కుటుంబంతో కలిసి పూసలబస్తీలో నివాసం ఉండేది. వారి పక్క ఇంట్లో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఫ్యామిలీతో కలిసి ఉండేవాడు. ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. దీనిని ఆసరాగా చేసుకున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మహిళతో అసభ్యంగా మాట్లాడం మొదలు పెట్టాడు. తాను పోలీస్ అని తనను ఎవరు ఏమి చెయ్యలేరంటూ మహిళను వేదింపులకు గురిచేసేవాడు.. తనకు సహకరించాలని మానసికంగా బాధపెట్టేవాడు.

ఈ క్రమంలోనే ఓ రోజు భర్తముందే సదరు మహిళని అసభ్యంగాదూషించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దింతో కొంతకాలం వారి జోలికి వెళ్లకుండా ఉన్నాడు. కాగా గత నెల 25న బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మరుసటిరోజు బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

పక్కింటి మహిళపై కన్నేసిన కానిస్టేబుల్