Rajasthan election results : కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ

372

Rajasthan election results : కాంగ్రెస్ పాలిత రాష్ట్రము రాజస్థాన్ లో మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 3035 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో అధికార కాంగ్రెస్ 1197 వార్డుల్లో విజయం సాధించగా, 1140 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 20 జిల్లాలో ఉన్న 90 మునిసిపాలిటీలలో ఈ ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష బీజేపీ గట్టిగ పోటీ ఇచ్చింది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ కంటే బీజేపీనే అధిక సీట్లను గెలుస్తుంది అనిపించింది. కానీ చివరకు కాంగ్రెస్ కి బీజేపీ మధ్య 57 సీట్ల స్వల్ప తేడా వచ్చింది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, సత్తా చాటారు. స్వతంత్ర అభ్యర్థులు 634, ఎన్సీపీ 46, ఆర్ఎల్పీ 13 స్థానాల్లో సీపీఎం 3, బీఎస్పీ ఒక స్థానంలో విజయం సాధించాయి.

Rajasthan election results : కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ