మే నెలలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు.

354

కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా తాత్కాలిగా అధ్యక్షురాలితోనే కొనసాగుతుంది. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు గాంధీ కుటుంబంలోని వారే అధ్యక్షులుగా ఉండాలని అంటుంటే మరికొందరేమో ఇతరులకు అవకాశం ఇవ్వాలని సోనియాను కోరుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మే నెలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సమాలోచన చేస్తున్నారంట. ఇందుకోసం పార్టీ ప్లినరీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. మే నెలలో జరిగే ప్లినరీ సమావేశాల్లో అధ్యక్షుడి ఎన్నికతోపాటు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమావేశంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతుల ఆందోళనలతో పాటు కరోనా మహమ్మారిపై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమంపై కాంగ్రెస్ నేతలతో చర్చించారు. పార్టీ పరిస్థితిపై నేతలను అడిగితేలుస్తుకున్నారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా మే తర్వాత బాధ్యత నుంచే తప్పుకునే అవకాశం మెండుగా కనిపిస్తుంది.

అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీ చీఫ్‌గా మళ్లీ సోనియా గాంధీ పగ్గాలు చేపట్టారు. కానీ ఇటీవల ఆ పార్టీలో సీనియర్లు సోనియాకు వ్యతిరేకంగా గళం ఎత్తారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఏఐసీసీ ప్లీనరీ నిర్వహించనున్నది.

మే నెలలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు.