నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కాంగ్రెస్ చంపింది :- సాక్షి మహారాజ్

368

శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతోత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ కోల్ కత్తాలో నేతాజీకి నివాళి అర్పించారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో నగరంలో జరిగిన జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ సాక్షిమహారాజ్ పాల్గొన్నారు. ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో ఉండే సాక్షి మహారాజ్ ఈ సారికూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేతాజీని కాంగ్రెస్ పార్టీనే చంపి ఉంటుందని అన్నారు. గాంధీ, నెహ్రులకంటే నేతాజీకే ప్రజాదరణ అధికంగా ఉండేదని అన్నారాయన. దానిని తట్టుకోలేక, చరిత్రలో తమ పేరు కనుమరుగవుతుంది అనే ఉద్దేశంతో వారు ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు నేతాజీ మృతిపై సరైన విచారణ కూడా జరపలేదని, విమాన ప్రమాదం జరిగి మృతి చెందారని కాంగ్రెస్ తేల్చేసిందని మండిపడ్డారు.