బీజేపీ వైపు కేకే మహేందర్ రెడ్డి చూపు..

395

కేకే మహేందర్ రెడ్డి.. సిరిసిల్ల జిల్లాలో మంచి పేరున్న నాయకుడు. 2009 వరకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 లో సిరిసిల్ల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 171 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేశారు మహేందర్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

త్వరలో మహేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కు చెందిన మరికొందరు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇక కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలోకి పొన్నం అనుచరులు కొందరు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారంట. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంచం సీడ్ పెంచింది.. రాజకీయాలు చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న నేతలను తిరిగి యాక్టీవ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయతిస్తుంది. క్యాడర్ తోపాటు లీడర్ కూడా బలంగా ఉండాలని బీజేపీ భావిస్తుంది.

బీజేపీ వైపు కేకే మహేందర్ రెడ్డి చూపు..