సోనియాగాంధి నివాసంలో ముగిసిన కాంగ్రెస్ నేతల సమావేశం

49

ఢిల్లీలోని సోనియాగాంధి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు నేతలు. మొత్తం 19 మంది సీనియర్ నేతల అభిప్రాయాలను సోనియాగాంధి తీసుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై ఎవరికీ అభ్యంతరాలు లేవని నేతలు వెలియబుచ్చారు.

అయితే చింతన్ శిభిరాన్ని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి చర్చ జరపాలని కొందరు నేతలు అన్నట్టు తెలుస్తోంది. సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ప్రసంగించారు. ముందే నిర్ణయించిన దానిప్రకారం సంస్థాగత ఎన్నికల ద్వారానే కొత్త నాయకత్వం ఎంపిక ఉంటుందని పార్టీ నేత పవన్ కుమార్ బన్సల్ తెలిపారు.