కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్య..

96

భూవివాదంలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మెట్ పల్లి గ్రామానికి చెందిన రాచమళ్ళ సంపత్ కు, అదే గ్రామానికి చెందిన భోనగిరి ఓదయ్య మధ్య గత కొంత కాలంగా భూ వివాదం కొనసాగుతుంది. దింతో కేశవపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఇక శుక్రవారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ ఉంది. అయితే గురువారం పొలందగ్గరకు వెళ్ళాడు సంపత్, అక్కడే ఉన్న భోనగిరి ఓదయ్య ఘర్షణపడ్డారు. సమీపంలోని భోనగిరి ఓదయ్య కుమారుడు జంపయ్య వచ్చి సంపత్‌ మెడ భాగంలో గొడ్డలితో నరికాడు. రక్తపు మడుగులో పడి సంపత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్య..