టీపీసీసీ పదవిపై స్పందించిన జీవన్‌రెడ్డి

1268

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. పీసీసీ పదవిపై ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని, కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని.. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెస్తానని అన్నారు.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కాగా జీవన్ రెడ్డికి పీసీసీ ఖరారు అయిందన్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ముందుగా ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.