ఘోర ప్రమాదం 70 మంది మృతి

731

బుటెంబోలోని కాంగో నదిలో ఓ ప్రయాణికుల ఓడ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 70 మంది మృతి చెందగా 330 మంది గల్లంతయ్యారు.. మరో 300 మంది సురక్షితంగా బయటపడ్డారు. 700 మంది ప్రయాణికులతో ఈ ఓడ కిన్షాసా నుంచి బయలుదేరి భూమధ్యరేఖ ప్రావిన్సు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లనే ఇది బోల్తా పడినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు 70 మృతదేహాలను వెలికితీశారు.ఈ ప్రమాదంపై కాంగో మంత్రి ఎంబీకాయి స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

300 మంది సురక్షితంగా బయటపడ్డారని. మరో 300 మందికిపైగా ఆచూకీ తెలియరాలేదని వివరించారు. వారికోసం హెలికాఫ్టర్ల ద్వారా గాలింపు చేపడుతున్నామని వివరించారు. మాయి నోడోంబీ ప్రావిన్సులోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలో పడవ కుదుపుకు గురై ఒక పక్కకు ఒరగడంతో ప్రయాణికు బ్యాలెన్స్ తప్పి ఒకవైపు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణలో పోలీసులు గుర్తించారు. అయితే ప్రయాణికులు కూడా పరిమితికి మించి ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. 550 కెపాసిటీ ఓడలో 700 మందిని ఎక్కించారని వివరించారు.

ఘోర ప్రమాదం 70 మంది మృతి