జనవరి 2 నుంచి ఇంటర్‌ కాలేజీలు రీఓపెన్!

69

కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడిన విషయం తెలిసిందే. వచ్చే నెల 2 వ తేదీ నుంచి తెరిచే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షల్లో వెసులుబాటు కల్పించాలా అనే విషయంపై విద్యాశాఖ చర్చిస్తుంది. ఇక ప్రశ్న పత్రంలో ఛాయిస్ ప్రశ్నల సంఖ్యను కూడా పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

ఇంతకాలం ఇళ్లవద్ద చదివిన విద్యార్థులు అడపాదడపా చదివి ఉంటారని. వారికీ పాతపద్ధతిలో ప్రశ్న పత్రం ఇస్తే నష్టపోయే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తుంది.. ఈ నేపథ్యంలోనే ప్రశ్నల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉంది. పరీక్షల నిర్వహణలో.. విద్యార్థులంతా భౌతికదూరం పాటించాల్సి ఉన్నందున..అధికారులు కాలేజీలను సందర్శించి అవసరమైన వసతులు కల్పించాలని విద్యాశాఖ ఆదేశించింది.

జనవరి 2 నుంచి ఇంటర్‌ కాలేజీలు రీఓపెన్!