ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్‌

167

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. సాయంత్రం 4:30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. అనంతరం రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిస్తారు.