14న సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం సందర్శన

75

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈనెల 14వ తేదీన పోలవరం సందర్శనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమయంలోగా పూర్తి చేయించడానికి ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 14వ తేదీన పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

14వ తేదీ ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకోనున్న సీఎం అనంతరం వాహనంలో పోలవరం డ్యామ్‌ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎంత మేర పనులు జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ సఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు పాల్గొననున్నారు.