సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

135

సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం అయింది.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రానికి వివిధ పథకాల రూపంలో కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను రాబట్టేందుకు ఏ విధంగా పోరాటం చెయ్యాలి అనే అంశంపై సీఎం జగన్ ఎంపీలతో చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్షం భావిస్తోంది.